
ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ
ఆళ్ళ గడ్డ నియోజకవర్గ తెలుగు యువత నాయకులు భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి
చాగలమర్రి, (PAWANIJAM NEWS) :
నిత్యవసర సరుకుల ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తున్నదని ఆళ్ళ గడ్డ నియోజకవర్గ తెలుగు యువత నాయకులు భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి పేర్కొ న్నారు . మంగళవారం మండల పరిధిలోని తోడేండ్లపల్లెలో ఓ కార్యక్రమానికి హాజరైన భూమా కు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు,అభిమానులు పూలతో ఘన స్వాగతం పలి కారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పెట్రోలు,డిజల్ ధరలు ప్రక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయ న్నారు. విద్యుత్ చార్జీలు,బస్సు చార్జీలను విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేసిన ఘనత వైసిపి ప్రభుత్వందే అన్నారు. ప్రతి సమావేశంలో జన్మభూమి కమిటీల మీద ఆరోపణలు చేసే ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేలు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ జన్మభూమి కమిటీలు మీరు వేసింది కాదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశా లను కల్పిస్తామని చెప్పిన ము ఖ్యమంత్రి ఇంతవరకు ఎటు వంటి ఉద్యోగ అవకాశాలను కల్పించ లేదన్నారు. కేవలం వాలంటీర్ల,సచివాలయ ఉద్యో గులను మాత్రమే ఎంపిక చేసి చేతులు దులుపు కున్నార న్నారు. సచివాలయాల ఉద్యో గులు కూడా ఎక్కడ తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కార్యక్రమం టిడిపి నాయకులు మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, హుసేన్‌రెడ్డి, సంజీవరెడ్డి, పుష్పరాజ్, శ్రీనివాసరెడ్డి, జనార్ధనరెడ్డి పక్కిరెడ్డి,గాబ్రెల్,చంద్రమోహన్రెడ్డి,జీవన్,సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.