ANDHRA PRADESHBREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

స్నేహితురాలికి ఆర్థిక చేయూత‌

స్నేహితురాలికి పూర్వ విద్యార్థుల ఆర్థిక చేయూత‌
రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్ర అనారోగ్యంతో ఉన్న తంబల రాజేశ్వరి
విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు
ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకున్న పూర్వ విద్యార్థులు
వెల్దుర్తి, డిసెంబర్ 08,(PAWANIJAM NEWS)
కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988- 89 సంవత్సరంలో పదవ తరగతి విద్యనభ్యసించిన మిత్రులందరూ కొన్ని రోజుల క్రితం 35 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో తమ మిత్రురాలు తంబల రాజేశ్వరికి రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్ర అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకొని మిత్రులు తలా కొంత నగదును సేకరించుకొని ఆమెకు 20వేల రూపాయల నగదును ఆదివారం అందజేశారు. ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహ నాయుడు మాట్లాడుతూ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి విద్యనభ్యసించామని ఒకరికొకరం బంధువుల కంటే ఎక్కువగా ఆత్మీయ స్నేహితులుగా మారిపోయామని తెలిపారు. ఒకరికొకరం అండగా నిలబడాలని ఎవరికీ ఏ కష్టం వచ్చినా మిత్రులందరం  కొంత సహాయం చేసుకుని ఆదుకోవడం ద్వారా ఎటువంటి కష్టాన్నైనా దాటవచ్చని ఐకమత్యంతో అందరం ఒకరికొకరు సాయం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి పూర్వ విద్యార్థులు హెల్పింగ్ హ్యండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహనాయుడు, శ్యామల , సువర్ణ, భారతి, షేక్షావలి, బ్రహ్మానందరెడ్డి, బషీర్ అహ్మద్, పామయ్య యాదవ్, ఖలీల్ భాష , హరి నాధ్, మల్లిఖార్జున రెడ్డి, పెద్ద రజాక్, జయన్న ఆచారి తదితరులు తమ మిత్రురాలికి నగదు సహాయం అందించి ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!