
అధైర్య పడొద్దు.. అండగా ఉంటా – శిల్పా చక్రపాణి రెడ్డి
శ్రీశైలం, జూన్ 26, (పవనిజం న్యూస్):
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం మహానంది, బండి ఆత్మకూరు మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతీర్పును గౌరవించాలని అన్నారు. కార్యకర్తలు అధైర్య పడవద్దని, ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. కార్యక్రమంలో రెండు మండలాల నాయకులు పాల్గొన్నారు.