ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లతో బంగారు భవిష్యత్తు
ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని సాధించాలి

ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లతో బంగారు భవిష్యత్తు : డా. కేవీ. సుబ్బారెడ్డి
ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని సాధించాలి : పీవీ. సునీల్ కన్న
కర్నూలు, మార్చి 19, (PAWANIJAM NEWS) :
ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లు విద్యార్థుల కు బంగారు భవిష్యత్తు చూపేలా పని చేయాలని పలువురు విద్యావేత్తలు ఆకాక్షించారు. చదువు కున్న ప్రతి విద్యార్థి కి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లు చక్కటి విద్యా,ఉపాధి అవకాశాలు లభించేలా అవగాహన కల్పించా లని కోరారు. ఆదివారం కర్నూలు స్కంద హబ్ లో మున్నా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ని ప్రముఖ విద్యావేత్త డా. కేవీ సుబ్బారెడ్డి, డా. బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్. పీవి. సునీల్ కన్న, బీ ఆర్ కే ఫౌండేషన్ చైర్మన్ బొల్లే ద్దుల రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టు నాయకులు టీ.విజయ్, అబ్దుల్ సత్తార్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్య చదివిన ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించడానికి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లు ఎంతగానో ఉప యోగ పడతాయన్నారు. విద్యార్థులు సరైన అవగాహన కలిగి, మంచి విద్యా సంస్థల ను ఎంచుకొన్నపు డే వారి కల సాకారం అవుతుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు మున్నా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మంచి విద్యా,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. డా. బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ పివీ. సునీల్ కన్న మాట్లాడుతూ కర్నూలులో మున్నా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోపడు తాయని చెప్పారు.నర్సింగ్ నుండి మొదలు కొని ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ సీట్లు ఇప్పించడం కోసం మున్నా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రారంభించడం మంచి పరిణామ మన్నారు. విద్యార్థులు ,నిరుద్యోగుల కోసం చేసే సేవా కార్యక్రమాల కు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని ఆయన తెలిపారు. బీ ఆర్ కే ఫౌండేషన్ చైర్మన్ బొల్లే ద్దుల రామకష్ణ మాట్లాడుతూ కష్టపడి, ఇష్టపడి చదువుకున్న విద్యార్థులు ,నిరుద్యోగు లకు మున్నా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సరైన అవగాహన కల్పించేలా పని చేయాలని కోరారు. కర్నూలు జిల్లా లోని ప్రతి విద్యార్థి కి మంచి విద్యా సంస్థల వివరాలు అందించి వారి భవిష్యత్తు కు బంగారు బాటలు వేయాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మార్గ నిర్దేశం చేయాలని రామ కృష్ణ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ మన్సూర్, కో ఆర్డినేటర్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.