ANDHRA PRADESHBREAKING NEWSJANASENA PARTYPOLITICSSTATE

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కలిసిన రేఖగౌడ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మిగనూరు ఇంఛార్జి రేఖగౌడ్

చేనేత, త్రాగునీరు, సాగునీటి, సమస్యలపై అధినేతకు వినతి

నియోజకవర్గంలో అభివృద్ధికి అన్ని విధాల ఆదుకోవాలన్న రేఖగౌడ్

ఎమ్మిగనూరు ప్రతినిథి, జూన్ 22, (సీమకిరణం న్యూస్):

జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీయం కొణిదల పవన్ కళ్యాణ్ ని శనివారం జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జి రేఖగౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిస్థితులను అధినేతకు వివరించినట్లు మీడియాకు తెలిపారు. ఎమ్మిగనూరులో అధికంగా అన్ని వర్గాల ప్రజలు చేనేత రంగాన్ని నమ్ముకున్నారని నేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అలాగే నియోజకవర్గ పరిధిలోనీ చాలా గ్రామాల్లో దశాబ్దాలుగా నెలకొన్న త్రాగునీరు మరియు సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని శాశ్వత పరిష్కారం కోసం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ ను కోరినట్లు జనసేన పార్టీ ఇంఛార్జి రేఖగౌడ్ తెలిపారు. సానుకూలంగా స్పందించిన పవన్ ఎంతో నమ్మకంతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని భారీ విజయంతో గెలిపించారని వారు ఎదుర్కొనే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారం కోసం పనిచేస్తే తమ సహకారం ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారని రేఖగౌడ్ తెలిపారు,అలాగే జిల్లాల వారీగా జనసేన అధ్యక్షులు త్వరలోనే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్థారని చెప్పడం జరిగిందన్నారు, మొదటగా రాయలసీమ జిల్లాల నుంచే సమావేశలను ప్రారంభించేలా ప్రతి నియోజకవర్గ జనసేన నాయకులను క్రియాశీలక కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించే వరకు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడాలని కష్టపడి పనిచేసిన ప్రతి జన సైనికుడికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని జనసేన అధినేత డిప్యూటీ సీయం పవన్ సూచించినట్లు రేఖగౌడ్ తెలిపారు.

Related Articles

Back to top button
error: Content is protected !!