ANDHRA PRADESHBREAKING NEWSBUSINESSCRIMEMOVIESPOLITICSSPORTSSTATETELANGANAWORLD

ప్రజల మద్దతు మత పెద్ద ఆశీస్సులతో కర్నూలు ఎమ్మెల్యేగా గెలుస్తా

ప్రజల మద్దతు మత పెద్ద ఆశీస్సులతో కర్నూలు ఎమ్మెల్యేగా గెలుస్తా : అబ్దుల్ సత్తార్
కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 14, (pawanijam news) :
అల్లా దయతో కర్నూలు ప్రజల మద్దతు, మత పెద్దల ఆశీస్సులు ఉంటే తాను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు , ఎమ్మెల్యే అభ్యర్థి గాజుల అబ్దుల్ సత్తార్ షేక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పలువురు మత పెద్దలను కలిసి మద్దతు కోరుతున్న ఆయన ఇవాళ బండి మెట్టలోని సాహెబా ఫాతిమా అమ్మిజాన్ దర్గాలో పలువురు మత పెద్దలతో కలిసి ప్రత్యేక ఫాతెహాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. ముస్లింల సమస్యలు పరిష్కారానికై తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, కర్నూలులో అధిక శాతం ఉన్న ముస్లింలందరూ ఈసారి తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. పాతికేళ్లుగా తాను కర్నూలు నగరంలో జర్నలిస్టుగా, విద్యార్థి ,మైనార్టీ నాయకుడిగా ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశానని , ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సోదరులందరూ ఈసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించి కర్నూలు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఆయన ప్రజలను కోరారు. నగర ముస్లింల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా తాను పనిచేస్తానని మత పెద్దలు, ముస్లిం సోదరులందరూ తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని అబ్దుల్ సత్తార్ కోరారు. అమ్మిజాన్ దర్గా ముత్తవల్లిసయ్యద్ ఇక్బాల్, పీఠాధిపతులు హబీబుల్లా, సయ్యద్ షఫీ ఉల్లా ఖాద్రి తో పాటు మైనారిటీ నాయకులు మాలిక్, ఖలీల్ ,మహమ్మద్ భాష ,ప్రిన్స్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!