గోనెగండ్ల ఉర్దూ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

గోనెగండ్ల ఉర్దూ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఎమ్మిగనూరు టౌన్, ఏప్రిల్ 30, (PAWANIJAM NEWS) :
ఎమ్మిగనూరు నియోజకవర్గ గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలోని ఉర్దూ పాఠశాల భవనంను ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఉర్దూ భవనంలో పెచ్చులూడిపడి ఇద్దరు విద్యార్థులు మహమ్మద్ ఆరిఫ్ అనే విద్యార్థిలను వారు పరామర్శించారు. ఎంఇఓ ఎన్నిసార్లు స్కూల్ లను పరిశీలిస్తున్నారని, ఈ స్కూల్ గురించి రిపోర్టు ఎందుకు పంపలేదని అధికారుపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాడు- నేడు కింద వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో ఈ స్కూల్ ను నిర్మించారని, ఈ స్కూల్ ఇంత తొందరగా శిథిలావస్థకు చేరిందని, నాసిరకం కట్టి ప్రతి స్కూల్ పనికిరాకుండా చేశారని మండిపడ్డారు. ఈ రోజు ఆ స్కూల్ అన్ని పడగొట్టి కొత్తగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. నాడు- నేడు కింద ఈ స్కూల్ ను నూతనంగా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నసురుద్దీన్, ఎంపీడీవో, నాగేష్ నాయుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మన్సూర్, బాస్కర్ రెడ్డి, బందె నవాజ్, కాశీరెడ్డి, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.