భజనరాయుళ్లుగా మారిన మంత్రులు

అప్పుల అప్పారావుగా సీఎం జగన్ రెడ్డి
-: 70 వేల కోట్లకు లెక్క ఏదీ
-: భజనరాయుళ్లుగా మారిన మంత్రులు
-: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్
కర్నూలు టౌన్, ఏప్రిల్ 28, ( పవనిజం న్యూస్) :
ఏపీ సీఎం జగన్ రెడ్డి అప్పుల అప్పారావుగా మారారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నంద్యాల జిల్లా డిసిసి అధ్యక్షుడు లక్ష్మి నరసింహ, కర్నూలు సిటీ అధ్యక్షులు జాన్ విల్సన్ లతో కలిసి కర్నూలులో పీసీసీ అధ్యక్షులు డా.సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబి లో కూరుకుపోయిందన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఢిల్లీలో మంత్రిని బయటపెట్టి లోపల చీవాట్లు పెట్టించుకున్నారని తెలిపారు. ఏపీ మర్యాదను సీఎం మంట గలుపుతున్నారని మండిపడ్డారు. ప్రజలను అడుక్కునే వాళ్లుగా మారుస్తున్నా రన్నారు. లక్ష 10 వేల కోట్లు పంచామంటున్నారని, 70 వేల కోట్లకు ప్రభుత్వం లెక్క చూపడం లేదని తెలిపారు. మంత్రి బుగ్గనకు రోషం ఉంటే రాజీ నామా చేయాలని, మంత్రిని బయటకు పంపా రంటేనే పరువుపోయిందని ఆగ్రహించారు. మంత్రులు భజనరాయుళ్లుగా మారిపోయారన్నారు. ఎక్కడ అత్యాచారం జరిగినా ప్రభుత్వం ధర నిర్ణయిస్తుందని తెలిపారు. ఎల్జీ పాలీ మార్స్‌లో ప్రమాద బాధితులకు కోటి ఇస్తారని, అత్యాచార బాధితులకు రూ.5 లక్షలు ఇస్తారా అని శైలజానాథ్ ప్రశ్నించారు.
రాష్ట్రానికి కొత్తఅప్పులు పుట్టకపోవడంతో ముఖ్య మంత్రి జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని శైలజనాథ్ ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పా లన్న కేంద్రం లేఖతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పారు. అప్పులు, కార్పొరేషన్ల ద్వారా తీసు కున్న రుణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నివేదికను కేంద్రం వెనక్కి పంపిందని, రాష్ట్ర ప్రభుత్వ నివేదికపై పలు సందేహాలను వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో స్వయంగా రావాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి తాఖీదులు ఇవ్వడం సిగ్గు చేటని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతు న్నారని వాపోయారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్స్ రోగులే కొనుగోలు చేసే దుస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోని ధర్మాసుపత్రుల్లో పరి స్థితి భిన్నంగా ఉందని, వైద్యులు రోగులకు సేవలందిస్తున్నా ఔషధాల విషయంలో చేతు లెత్తేస్తున్నారని, అన్నీ రోగులే తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడుమూరు ఇన్చార్జి దామోదర్, రాధాకృష్ణ, మంత్రాలయం నియోజవర్గ ప్రధాన కార్యదర్శి బాబూరావు, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్య నారాయణ గుప్తా సోషల్ మీడియా జిల్లా కోఆర్డి నేటర్ రవి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు శేఖర్, మహిళా సంఘం నాయకురాలు ప్రమీ లమ్మ, డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నా థరెడ్డి, సేవాదళ్ చైర్మన్ సయ్యద్ హుస్సేన్ NSUI రాష్ట్ర ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.