గిరిజనుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు
గిరిజన గురుకుల పాఠశాలలు మూసి వేయడం తగదు

గిరిజన గురుకుల పాఠశాలలు మూసి వేయడం తగదు
గిరిజనుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు
జనసేన పార్టీ కర్నూలు నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు
కర్నూలు, ఏప్రిల్ 23, (PAWANIJAM NEWS):
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా 81 గిరిజన గురుకుల పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి, జనసేన కర్నూలు నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గిరిజనుల విద్యార్థుల పట్ల ఏ విధమైన నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు. గిరిజన విద్యార్థులు చదువులకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అడవులలో సమస్యలతో సతమతమవుతున్న గిరిజన కుటుంబాలు వారి పిల్లలు కూడా చదువులకు దూరం అయితే గిరిజనుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలని అన్నారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న 81 పాఠశాలలను తిరిగి తెరిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 173 గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నాయని వీటిలో ఒక్క సారిగా 81 పాఠశాలలను రద్దు చేస్తే అందులో చదువుతున్న విద్యార్థులు ఎక్కడికి వెళ్లి చదువుకోవాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం విద్య పట్ల చిన్నచూపు చూస్తోందని ఆయన విమర్శించారు. నిజంగా గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని అన్నారు. ఇప్పటికైనా స్పందించి తప్పనిసరిగా మూసివేసిన పాఠశాలలను తిరిగి జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన గురుకుల పాఠశాలలో మరిన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు.