BREAKING NEWSJANASENA PARTYPOLITICSSTATE

గ్రామ ప్రజలకు గుక్కెడు నీరు కరువు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇవే కష్టాలు

కోట్లు ఖర్చు చేసిన గ్రామ ప్రజలకు గుక్కెడు నీరు కరువు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇవే కష్టాలు

జనసేన పార్టీ రాయలసీమ విధానం వీర మహిళ ప్రాంతీయ కమిటీ కో-ఆర్డినేటర్ యస్.ఎం.డి.హసీనా బేగం

కర్నూలు టౌన్, ఏప్రిల్ 23, (PAWANIJAM NEWS) :

మండు వేసవిలో తాగునీటి కోసం గ్రామీణ ప్రజలు విలవిలలాడిన పోతున్నారని జనసేన పార్టీ రాయలసీమ విభాగం వీర మహిళ ప్రాంతీయ కమిటీ కో-ఆర్డినేటర్ యస్.ఎం.డి.హసీనా బేగం అన్నారు.
జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో లక్షల రూపాయలు ఖర్చు చేసి తాగునీటి సమస్య తీర్చేందుకు అధికార యంత్రాంగం పైపులైన్లు ట్యాంకులు నిర్మించారు అని అయినా ఫలితం దక్కడం లేదని తీవ్రంగా విమర్శించారు.
చిన్నపాటి పనులు చేస్తే గ్రామీణ ప్రాంతాలకు నీటిని అందిచొచ్చు అయితే పాలకులు, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు అని తెలిపారు.నీటి ప్రాజెక్టుల వైపు అధికారులు అటువైపు వెళ్లడం లేదు అని అన్నారు. ప్రతిపాదనల దస్త్రాలు అటకెక్కాయి అని జనం గుక్కెడు నీటికి అల్లాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. జనం దాహార్తి తీర్చేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు అని తీవ్రంగా విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 950 గ్రామీణ ప్రాంతాలు గ్రామీణ ప్రజల తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు అని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో 973 పంచాయతీల్లో వేసవిలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.7.49 కోట్ల వ్యయంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రణాళికలు రూపొందించారు అని ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకముందే మరో ప్రణాళిక సిద్ధం చేసి పంపాలంటూ తాజాగా ఆదేశాలు రావడం పలు విమర్శలకు దారి తీస్తుందని అన్నారు. ఇప్పటికే వేసవిలో రెండు నెలలు గడిచిపోయాయని, ఇక రెండు నెలలకు (మే, జూన్‌) కర్నూలు, నంద్యాల జిల్లాలకు రూ.7.49 కోట్ల నిధులు అవసరముండదని, తిరిగి ప్రణాళిక (రివైజ్డ్‌) పంపాలన్న ఆదేశాలు అందాయి దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అని అన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అధికారులు నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు అని అవి ఏ విధంగా ముందుకు వెళతాయి అర్థంకాని పరిస్థితి ఉందని తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షలకుపైగా జనం నివసిస్తున్నారు అని ఒక్కో మనిషికి రోజుకు 55 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉందన్నారు. ఈ లెక్కన రోజుకు 16 కోట్ల 51 లక్షల లీటర్లు అందించాలి అయితే అధికారులు గ్రామీణ ప్రజలకు రోజుకు ఈ వేసవిలో 14 కోట్ల 3 లక్షల 35 వేల లీటర్లు సరఫరా చేస్తున్నారు అని అన్నారు. ఈ లెక్కన ప్రతిరోజూ 2 కోట్ల 47 లక్షల 65 వేల లీటర్లు సరఫరా చేయలేకపోతున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు ఆమె తీవ్రంగా విమర్శించారు.

Related Articles

Back to top button
error: Content is protected !!