
జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పత్తికొండ, ఏప్రిల్ 23, (pawanijam news) :
జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. వైఎస్సార్ సున్న వడ్డీ పథకం మూడవ విడత క్రింద పత్తికొండ పట్టణం కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపం నందు జరిగిన కార్యక్రమంలో
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు. 1150 స్వయం సహాయక సంఘాలలోని 12,194 మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 1,56,88,812 కోట్లు చెక్ ను లబ్ధి పొందిన మహిళా స్వయం సహాయక సంఘాలకు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ క్రాంతి పథం కో ఆర్డినేటర్ రామంజినేయులు , ఏ పీ ఎం మధు బాబు ,ఎంపిపి నారాయణ దాస్ ,మాజీ ఎంపిపి నాగరత్నమ్మ ,మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక పాల్గొన్న వైఎస్సార్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీ రంగడు, వైస్ ఎంపిపి కొత్తపల్లి బలరాముడు, దూదేకొండ,చక్రాళ్ళ సర్పంచులు రెహ్మాన్ ,శ్రీరాములు,మాజీ సర్పంచ్ సోమ శేఖర్, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీ లు,మైనారిటీ నాయకులు,వార్డ్ మెంబర్లు,పాల్గొన్నారు.