ANDHRA PRADESHBREAKING NEWSBUSINESSCRIMEHEALTHMOVIESPOLITICSSPORTSSTATETELANGANAWORLD

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో రామ్ చరణ్.. పిక్స్ వైరల్

AP 10th Class Exams 2022: ఏపీలో టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. హాల్‌టికెట్‌ చూపిస్తే చాలు..

AP SSC Exams 2022: ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల రాసే విద్యార్థులకు ఆర్టీసీ బాసటగా నిలిచింది. విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపిస్తే పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చు.

AP 10th Class Exams 2022: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ విద్యార్థులకు జగన్ సర్కార్ బంపరాఫర్ ఇచ్చింది. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల రాసే విద్యార్థులకు ఆర్టీసీ బాసటగా నిలిచింది. విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపిస్తే పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించొచ్చు. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ పల్లెవెలుగు , సిటీ ఆర్డినరీ సర్వీసులకు వర్తిస్తుంది.

పరీక్ష అయిపోయాక ఇంటికి చేరుకునేందుకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అందులో సూచించారు. హాల్‌ టికెట్‌ ఆధారంగా బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాల వరకు రాకపోకలు సాగించొచ్చు. ఈ అవకాశం పదో తరగతి పరీక్షలు జరిగే ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 3,780 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 6,22,746 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఏపీలో టెన్త్ పరీక్షలు సబ్జెక్టుల వారీగా ఇలా ఉన్నాయి.

  • ఏప్రిల్ 27-తెలుగు
  • ఏప్రిల్ 28-సెకండ్ లాంగ్వేజ్
  • ఏప్రిల్ 29-ఇంగ్లీష్
  • మే 2-గణితం
  • మే 4-సైన్స్ పేపర్‌-1
  • మే 5-సైన్స్ పేపర్-2
  • మే 6-సోషల్ ఎగ్జామ్

Related Articles

Back to top button
error: Content is protected !!