IPL 2022: ‘ముంబై జట్టులో విభేదాలు.. అందుకే ఈ ఓటములు’

ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఓటమి చెంది పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ అఖరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ లిన్ సంచలన వాఖ్యలు చేశాడు. ముంబై జట్టులో అంతరర్గత విభేదాలున్నాయాని, అందుకే జట్టు వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతుందని క్రిస్ లిన్ అభిప్రాయపడ్డాడు.
“ముంబై జట్టుకు గెలవడం,ఓడిపోవడం రెండూ అలవాటే. ముంబై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమస్యలు ఉన్నాయి. వారి డ్రెస్సింగ్ రూంలో గ్రూపులు ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో ముంబై జట్టు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంది. అది జట్టుకు మంచి సంకేతం కాదు. కాగా కెప్టెన్ ఒత్తిడిలో ఉన్నప్పుడు పొలార్డ్ వంటి సీనియర్ రోహిత్‌కు సాయంగా ఉండాలి. కానీ జట్టులో అది కనిపించడంలేదు అని క్రిస్ లిన్ పేర్కొన్నాడు.