
సిమ్లా: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన కేజ్రీవాల్.. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆప్ తలిపెట్టిన ర్యాలీలో కేజ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజలను, ఆమ్ ఆద్మీపార్టీని చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. అందుకే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు నిర‍్వహించేందుకు ప్రయత్నిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే ఓ కొత్త హిమాచల్‌ను ఆవిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ తెలిపారు. ఆప్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే సరికొత్త హిమాచల్‌ను చూపిస్తామని ప్రజలకు కోరారు. అలాగే, కాంగ్రెస్, బీజేపీ నేతలకు కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారు. ఆయా పార్టీల్లో ఉన్న సచ్ఛీలురందరూ వెంటనే ఆప్‌లో చేరిపోవాలని కోరారు.