క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వారిని సన్మానం
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్

క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వారిని సన్మానించిన ఇంచార్జి రేఖగౌడ్ :-
ఎమ్మిగనూరు టౌన్, జూన్ 10, (PAWANIJAM NEWS) :
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు చేసిన క్రియాశీలక కార్యకర్తలకు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ప్రశంశపత్రం అందించి శాలువతో సన్మానం చేశారు, మండల కేంద్రమైన గోనెగండ్ల పరిధిలోని అలువాల గ్రామంలో సభ్యత్వ కిట్లను అందించారు, ఈ సందర్భంగా ఇంచార్జి రేఖగౌడ్ మాట్లాడుతూ దేశంలో కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ప్రతి కార్యకర్త గర్వాంగ చెప్పుకొనేల కార్యకర్తల సంక్షేమం కోసం కృషిచేస్తు ప్రమాద వశాత్తు కార్యకర్త మరణిస్తే తక్షణమే సభ్యత్వం తీసుకున్న కార్యకర్త కుటుంబానికి 5 లక్షల భీమా అందించి అండగ నిలబడుతుందని తెలిపారు, రాబోయే రోజుల్లో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చేదిద్దే బలమైన సైనికులు జనసేనలో ఉన్నారని వారి శక్తి సామర్ధ్యాలు తెలిసే రోజులు దగ్గర్లోనే వుందని అన్నారు, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా,అల్వాల మునిస్వామి,షఫీ, మాబాషా, రవికుమార్,దూద్ పిరా,జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.



