అగ్రసేని సంస్థ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
జనసేన పార్టీ రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్ జవ్వాజి రేఖ గౌడ్

• హంద్రీ నది బఫర్ జోన్ లో ఇళ్ల నిర్మాణం చేస్తున్న అగ్రసేని సంస్థ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
• డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అగ్రసేని బిల్డర్స్
• తక్షణమే రెవిన్యూ, కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి
• జనసేన పార్టీ రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్ జవ్వాజి రేఖ గౌడ్
కర్నూలు టౌన్, జూన్ 02, (pawanijam news):
కర్నూలు నగరంలోని హంద్రీ నది బఫర్ జోన్ లో ఇళ్ల నిర్మాణం చేస్తున్న అగ్రసేని సంస్థ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్, రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ మెంబర్ జవ్వాజి రేఖ గౌడ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు. గురువారం స్థానిక కర్నూలు నగరంలోని హంద్రీ నది గర్భాన అగ్రసేని సంస్థ నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలతో కలిసి రేఖ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జవ్వాజి రేఖ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏప్రిల్ 26వ తేదిన అగ్రసేని సంస్థ హంద్రీ నది ఒడ్డున నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను నిలిపి వేయాలని ఆదేశించిన కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారని మీడియాకు వెల్లడించారు. యదేచ్ఛగా హంద్రీ నది ఒడ్డున అక్రమంగా 5 ఎకరాలలో 50 ఇళ్లను అగ్రసేని సంస్థ నిర్మిస్తున్నదని, అందులో 20 ఇళ్లు ఒక సర్వే నెంబరులో అనుమతి తీసుకొని పక్క సర్వే నెంబరులో ఇల్లు నిర్మించడాన్ని కర్నూలు మున్షిపల్ కార్పోరేషన్ అధికారులు గుర్తించారని, అయితే ఇప్పటి వరకు చర్యలు తీసుకో లేదన్నారు. 762/2 సర్వే నెంబరులో కేవలం 0.47 సెంట్లకు కెఎంసి నుండి అనుమతి తీసుకొని 5 ఎకరాలలో ఇళ్లు నిర్మిస్తుందన్నారు. 762/2 సర్వే నెంబరులో అనుమతులు తీసుకొని 470/డి, 424/బి సర్వే నెంబరులలో ఇళ్లు కడుతూ తనను నమ్ముకున్న వినియోగదారులను మోసం చేస్తుందని ఆరోపించారు. హంద్రీ నదిని ఆక్రమించి ఇళ్లు కడుతుంటే ఇరిగేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే కర్నూలు మున్సిపల్ మేయర్, పాలకవర్గం, రెవిన్యూ, కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్రసేని సంస్థ నిర్మిస్తున్న అక్రమ ఇళ్ల నిర్మాణాలను ఆపకపోతే జనసేన పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కుమార్, మౌలాలి,నాగరాజు, ప్రవీణ్, వంశీ, కేశవ రజిని గఫర్,అబ్దుల్లా, సతీష్, వీర మహిళలు చాముండేశ్వరి, లత తదితరులు పాల్గోన్నారు.