ANDHRA PRADESHBREAKING NEWSCRIMEPOLITICSSTATE
30న “స్పందన” కార్యక్రమం
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు

ఈ నెల 30న “స్పందన” కార్యక్రమం
జిల్లా కేంద్రంలోని సునయన ఆడిటోరియంలో, డివిజన్,మండల, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజల నుండి వినతుల స్వీకరణ
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు
కర్నూలు కలెక్టరేట్ న్యూస్ : ఈ నెల 30 వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో “స్పందన” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



