ANDHRA PRADESHBREAKING NEWSCRIMEPOLITICSSTATE

రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన

రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన

-: ప్రారంభించిన ఎంపీ డా. తలారి రంగయ్య

గోస్పాడు : మండల కేంద్రమైన గోస్పాడులో 4 రోజుల క్రింద ప్రారంభమైన గంగాభవాని మహోత్సావాల చివరి రోజు బుధవారం తాను పుట్టిపెరిగి ప్రస్తుతం అనంతపూర్ ఎంపీ డాక్టర్ శ్రీ తలారి రంగయ్య గోసుపాడులోని గంగభవాని మాతను దర్శించుకొన్న అనంతరం రాష్ట్రస్థాయి నాలుగు పండ్ల ఎడ్ల బలప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం తలారి రంగయ్య మాట్లాడుతూ గంగాభవాని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. చిన్ననాటి స్నేహితులను, ఊరి ప్రజలు ఆధారాభిమానాలు చూస్తుంటే నాకెంతో సంతోషం గా ఉన్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు పి.పి.మధు సూదనరెడ్డి,గ్రామ నాయకుడు వీరారెడ్డి,గ్రామ సర్పంచ్ ప్రమీలమ్మ,బాలన్న,విఆర్పీఎస్ రాష్ట్ర ఉపాద్యక్షులు బోయపులికొండన్న ,గ్రామ రైతుజనసంగం నాయకులు చంద్రమౌళీశ్వర రెడ్డి,దేవనాధ రెడ్డి,డొళ్లు తిమ్మయ్య,భూపాల్ రెడ్డి,గ్రామనాయకులు వీరారెడ్డి,విశ్వనాథరెడ్డి,హుస్సేన్,గోకారి,ఎంపీ గారి సోదరులు పెద్ద రంగయ్య, బాలరంగడు,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!