
జీ తెలుగులో ప్రారంభమైన దేవతలారా దీవించండి ’సరికొత్త ధారావాహిక
కర్నూలు , మే 04, (PAWANIJAM NEWS) :
రెండు వేరు వేరు మనస్తత్వాలు కలిగిన ఇద్దరి వ్యక్తుల కథ దేవతలారా దీవించండి’ సరి కొత్త ధారావాహిక ను మన ముందుకి జీ తెలుగు తీసు కొచ్చిందని తెలుగు ఛీఫ్ కంటెంట్ అధికారి అనురాధా గూడూర్ తెలిపారు.
మీరు మీ టీవీ సెట్లకు పూర్తిగా అతుక్కుపోయేలా చేయడానికి జీ తెలుగు సర్వం సిద్ధం చేసు కుంది. ఇందులో శ్రీవల్లిగా చైత్రా సక్కరి, సామ్రాట్ గా యశ్వంత్, భవానీగా నిరోషానటిస్తున్నారు. అణకువ గల ఒక అమ్మాయి శ్రీవల్లి, అహం కార స్వభావం కలిగిన అబ్బాయి సామ్రాట్ ల మధ్య జరిగే సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జీవితమంతా ఉల్లాసభరితంగా ఉండాలని కోరుకునే ఒక సాధా రణ మైన అమ్మాయి శ్రీవల్లి. కాబట్టి జీవితంలో జరిగే ప్రతి విషయo లోనూ మంచినే కనుక్కోవ డా నికి ప్రయత్నించే ఆమెలోని సానుకూల స్వ భావం మనకు ఇందులో కనిపిస్తుంది. వాస్త వానికి, తన కుటుంబ సభ్యులే ఆమెను నష్టజాతకురాలిగా భావించిన తర్వాత కూడా, తనలాగా ఆలోచించే మంచి అందగాడు మరియు అర్థం చేసుకునే అబ్బాయిని పెళ్ళి చేసు కోవాలని ఆమె కోరు కుంటుంది. దురదృష్టం వెక్కిరిస్తూ, తాను ఊహించిన కలల రాజ కు మారుడు అనిపించేలా కనిపిం చిన సామ్రాట్ అనే అబ్బాయిని ఆమె కలుసుకుంటుంది. ఆమె అతనితో ప్రేమలో పడినప్పటికీ, అమ్మాయిలంటే గౌరవం లేని అతని స్వభావం ఆమె అతి త్వరగానే గ్రహిస్తుంది, వారి ద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఏమి జరుగు తుందో అనే ఉత్కంఠత ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది! వాస్తవానికి, అతని తల్లి భవాని సైతమూ తన కొడుకు గురించి చాలా భయ పడుతుంటుంది. ‘దేవతలారా దీవించండి’ సరి కొత్త ధారావాహిక సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6.30 ని.లకు మీ జీ తెలుగులో ప్రసారం అవుతుందన్నారు.