ANDHRA PRADESHBREAKING NEWSJANASENA PARTYPOLITICSSTATE

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

…. జిల్లాలో పండగలన్నీ సోదరభావంతో జరుపుకుంటారు

జనసేన పార్టీ నాయకులు మహబూబ్ బాషా

కర్నూలు టౌన్, మే 02, (పవనిజంన్యూస్):

కర్నూలు జిల్లాలోని ముస్లిం సోదరులు సోదరీమణులు అందరికీ జనసేన పార్టీ నాయకులు మహబూబ్ బాషా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ పండగ ఈ పర్వదినాన్ని అన్ని కులాల వారు ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా సంతోషంతో సోదర భావంతో జరుపుకుంటారని అన్నారు. జిల్లాలోని ముస్లిం అందరూ 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం రంజాన్ పండగ పర్వదినాన్ని మంగళవారం జరుపుకుంటున్నారు అని అన్నారు. నగరం లోని మసీదులో అన్ని రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించాలని అన్నారు. నగరంలోని పాత ఈద్గా కొత్త ఈద్గా ప్రాంతాలను కూడా మున్సిపల్ శాఖ అధికారులు శుబ్రం చేశారని అన్నారు. వారందరికీ పేరు పేరునా అభినందనలు జరుపుకుంటున్నామని అన్నారు.
మత సామరస్యానికి కర్నూలు జిల్లా ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. జిల్లాలో ప్రతి పండుగను ముస్లింలు హిందువులు క్రైస్తవులు సోదరభావంతో కలిసిమెలిసి జరుపుకుంటారని అన్నారు. ఐకమత్యానికి ఇదే నిదర్శనమని అన్నారు. కర్నూలు జిల్లాలో కులమతాలకు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటారని
అన్నారు. పండగ సందర్భంగా ముస్లింలందరూ పేదలకు దానధర్మాలు చేయడం వల్ల అల్లా దయ వారికి సంపూర్ణంగా ఉంటుందని అన్నారు. ముస్లింలు పేదలకు పండగ రోజుకు ముందు ఫిత్రా అందజేస్తారని అన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!