సున్నావడ్డీ పథకం ద్వారా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా అభివృద్ధి
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి

వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా అభివృద్ధి
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరు టౌన్, ఏప్రిల్ 30, (PAWANIJAM NEWS) :
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే స్వగృహం నందు నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలలో వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా స్వయం సహాయక సంఘలకు రూ. (4.19) నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి , నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు. లబ్ధిదారుల వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలంలో వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు అక్కా చెల్లెమ్మ ల బ్యాంకు అకౌంట్లో జమ చేయడం జరిగిందని గతంలో తెలుగుదేశం నాయకులు మహిళలకు రుణ మాఫీ చేస్తామని చెప్పి ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసం పసుపు కుంకుమ కార్యక్రమం అని చెప్పి మహిళను మోసం చేసిన ఘనత చంద్రబాబుది కానీ, ప్రజా సంకల్ప యాత్రలో అక్కాచెల్లెళ్ల పడుతున్న ఆర్థిక ఇబ్బందులను చూసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న చలించిపోయి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం వై.యస్.ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించి నవరత్నాలలో చేర్చడం జరిగింది. నేడు మహిళల కోసం జగనన్న వారి అకౌంట్ హలో అమౌంట్ జమ చేయడం తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేక కడుపు మంటతో పగిలి పోతున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో చేయని ఈ విధంగా నవరత్నాలు ప్రతి పేదవాడికి న్యాయం జరగాలని తపించిపోతున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిఆర్. బసిరెడ్డి , ఎంపీపీ కేశన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, మూడు మండలల ఎంపీడీవో లు, కాశీరెడ్డి, విరుపక్షి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులకు తదితరులు పాల్గొన్నారు.