భారీగా సభ్యత్వాలు నమోదు చేయిస్తాం
కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి టిజి భరత్

భారీగా సభ్యత్వాలు నమోదు చేయిస్తాం
కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి టిజి భరత్
కర్నూలు టౌన్, (PAWANIJAM NEWS) :
భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదు చేయిస్తామని కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవంలో టిజి భరత్ పాల్గొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జూమ్ ద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా కర్నూల్ నియోజకవర్గం నుండి టిజి భరత్, ఐటీడీపీ నేతలు జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకొని, పార్టీకి రూ. 25వేలు విరాళం అందజేశారు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. టిడిపిని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, కర్నూల్ పార్లమెంటరీ ప్రెసిడెంట్ తిలక్, కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నిఖిల్, ప్రధాన కార్యదర్శి అశోక్, ఇతర ఐటీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.