అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి : సిపిఐ

అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి : సిపిఐ
పెద్దకడబూరు, (PAWANIJAM NEWS) :
అనుమతి లేని ఎర్ర మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో కొండ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ మండల పరిధిలోని మేకడోన, నౌలేకల్ గ్రామల మధ్యలో ఉన్న కొండ ప్రాంతాన్ని అక్రమంగా జేసిబితో ఎర్ర మట్టి ని ట్రాక్టర్లతో తోలుతున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్వవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రకృతిని కాపాడాల్సిన అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు. అధికారులే కాంట్రాక్టర్లకు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. కొండ ప్రాంతం నుంచి అక్రమంగా ఎర్ర మట్టిని తరలిస్తున్న సూపర్ వైజర్లు శేఖర్, గోపాల్ పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కుమారస్వామి ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, రామాంజనేయులు, చిన్నోడు, నరసప్ప, ఆంజనేయ, గోపాల్, ముక్కరన్న తదితరులు పాల్గొన్నారు.